Tuesday, 23 December 2014

పద్య రచన జాతకము

జాతకములు బూ టకములు
జాతకములన మ్మకునికి  జాతికి మేలౌ
జాతకములకును బదులుగ
నీతిని మఱి నమ్ముకొనుము నిరతము బడుగా !

Sunday, 21 December 2014

పద్య రచన -సూర్యోదయము ,చంద్రాస్త మయము

ప్రకృతి యందము  జూడుము ప్రా గ్ది శాన
తనదు బింబము నీటిలో తళుకు లీన
భాను నస్త మ  యంబును  బ్రభలు  లేమి 
యదిరె యందము చంద్రుని  నుదయ  మచట 

Tuesday, 9 December 2014

పద్య రచన -ఏనుగులు

పూల గుత్తులు చేబూని పురుష దంతి
యిచ్చు చుండెను దనదైన నింతి కచట
జన్మ దినముకా  బోలును  జల్ల గాను
బ్రదుకు  మాయను న టు లనా బగిది దోచె

Monday, 8 December 2014