Monday 25 April 2016

పద్యరచన........కందిపప్పు

కందిపప్పునుజూడుముకాంత!యచట
కనులకింపయ్యెబంగరుకాంతితోడ
ధరనుజూడగమిన్నునుదాకెమరిని
కొనకదప్పదుగామనకుబ్రదుకుటకు

ఖండకావ్యము.....రాంభట్లవారు

కాలభైరవ!మమ్ములగరుణజూడు
కాంక్షగలదయ్యనినుజూడగాశియందు
నీయుమనుమతిమరిమాకునీశ!నీవు
భాగ్యమొదవెనురాంభట్లవారివలన
నీదుదర్శనభాగ్యమ్మునెమ్మితోడ


Tuesday 16 February 2016

తల్లీ నిన్ను దలంచి .........


నిన్ను మనమున భావించి సన్నయమున
జేతబట్టితిబొత్తము,చిరునగవున
నన్నుదీవించియొసగుము,నచ్చువిధము
మంచివాక్కును,శబ్దముల్మందిపొగడ
సకల సద్గుణనికురంబ! శారదాంబ!


Thursday 1 October 2015

సెలవు

సెలవు  గాబ్రకట ననుని  చ్చిరి గురువులు
కవిత లకికను శంకర ! కారణంబు
దెలియ కుండెను , సెలవది దేని కొరకొ ?
యేండ్ల కొలదిగ  సాగెడి యీ కృ  షినిట
యాపి వేయుట  ధర్మమా ? యజ్ఞ పురుష !

Monday 16 February 2015

సిరికి మగడు చంద్ర శేఖరుండు

 విశ్వ  మంత ట గల విష్ణువే గద మఱి
సిరికి మగడు , చంద్ర శేఖరుండు
భక్త రక్షకుండు  భవనాశ  నకరుడు
లోక మాతకుపతి  లోక విభుడు

Sunday 8 February 2015

పద్య రచన -మొల్ల

మొల్ల రచియించె గావ్యమ్ము  ముఖ్యముగను 
కనగ రెండేసి  పాదము ల్గలుగు  నట్లు
తనర రామాయణమ్ము ను  దనివి  తీర
శ్రేయ  ములకునౌ  రచనలు చేతురుగద


అంశం- చందమామ. ఛందస్సు- తేటగీతి. నాలుగుపాదల మొదటి అక్షరాలు వరుసగా ‘చం - ద - మా - మ’ ఉండాలి

చందమామను జూడుము శర్మ ! నీవు
దనరె  బింబము చక్కని దళుకు తోడ
మాయ నటువంటి నల్లని మచ్చ తోడ
మధురముగ దోచె జూడగ  మరల మరల