Monday, 29 September 2014

డి డియరు ఫామ్సు (Buffolo grove,USA)

ఆది వార మగుట నాహ్లాద ముకొఱకు
మనుమ రాళ్ళ తోడ ,మఱియు కొడుకు
కోడ లియును రాగ ,కూడ వ చ్చిన నెయ్య
ములగ  లుపుకొ  నుచును ముదము తోడ

కార్ల మీదను బోతిమి కాంత ! మేము
ఒక్క యరగంట లోపల చక్క గాను
పోయి తిరిగితి మంతయు హాయి గలుగ
పండు వెన్నెల వంటియా యెండ లోన

డి డియరు  ఫామ్సుని  జూడగ
గడుగొని బోవంగ నచట గాంచితి రైడుల్
వడినడకల పొగ బండియు
గడు నొప్పగ నొంటె యుండె గనుగవ కింపౌ

చూచితి నట మఱి యింకను
చూచితి నే మొక్క జొన్న సొగసుల తోటన్
చూచి మఱి  బండి మీదను
దా చుట్టూ తిరిగి రాగ దాహము వేసెన్

తిరిగి తిరిగి యలసి చిరునగ వులతోడ
చేరు కొంటి మియిక చేరు వైన
యింటి మొగము వట్టి గంట లోపున జేరి
నిద్ర పోతి మమ్మ ! నీర జాక్షి !






No comments: