Thursday, 1 October 2015

సెలవు

సెలవు  గాబ్రకట ననుని  చ్చిరి గురువులు
కవిత లకికను శంకర ! కారణంబు
దెలియ కుండెను , సెలవది దేని కొరకొ ?
యేండ్ల కొలదిగ  సాగెడి యీ కృ  షినిట
యాపి వేయుట  ధర్మమా ? యజ్ఞ పురుష !

Monday, 16 February 2015

సిరికి మగడు చంద్ర శేఖరుండు

 విశ్వ  మంత ట గల విష్ణువే గద మఱి
సిరికి మగడు , చంద్ర శేఖరుండు
భక్త రక్షకుండు  భవనాశ  నకరుడు
లోక మాతకుపతి  లోక విభుడు

Sunday, 8 February 2015

పద్య రచన -మొల్ల

మొల్ల రచియించె గావ్యమ్ము  ముఖ్యముగను 
కనగ రెండేసి  పాదము ల్గలుగు  నట్లు
తనర రామాయణమ్ము ను  దనివి  తీర
శ్రేయ  ములకునౌ  రచనలు చేతురుగద


అంశం- చందమామ. ఛందస్సు- తేటగీతి. నాలుగుపాదల మొదటి అక్షరాలు వరుసగా ‘చం - ద - మా - మ’ ఉండాలి

చందమామను జూడుము శర్మ ! నీవు
దనరె  బింబము చక్కని దళుకు తోడ
మాయ నటువంటి నల్లని మచ్చ తోడ
మధురముగ దోచె జూడగ  మరల మరల

Friday, 30 January 2015

పద్య రచన -బీర కాయలు

చిత్ర మందున బెట్టిరి చెలువు గాను
బీరకాయలు లేతవి యాఱు  చూడు
నచ్చి , వాటిని కసకస నమలి  మ్రింగ
నూరు చున్నది నానోరు మేరి ! కంటె ?