Tuesday, 18 November 2014

నిషిద్ధాక్షరి శ -ష -స లు ,,,,శిశు పాల వధ ... తేటగీతి లో

ఊ రుకొంటిని దప్పుల నూఱు వరకు
హతము జేతును నిప్పుడే యతని  నింక
ననుచు గృ ష్ణుడా చేదివి  భునియ  మపురి
కంపె  జక్రాన దేవతల్  హాహ  యనిరి



పద్య రచన తల్లీ -కూతుళ్ళ సంభాషణ

కవిత లనినయా తల్లికి కడుపు మంట
యేమొ !  లేనిచో నట్లను టిచ్చ  గొనునె ?
నిచ్చ గించును గాబోలు తుచ్చ మైన
బూతు పాటల సినిమాలు భూరి గాను

Saturday, 15 November 2014

పద్య రచన -అవ్వ పుస్తకములు అమ్ముట

అవ్వ యచ్చట కూర్చుండి యమ్ము చుండె
పాత ,క్రొత్తవి  యైనట్టి  పలుర కముల
పుస్త కంబులు  పేపర్లు  పొలతు లార !
రండు కొనగను మానుచు దిండి యైన

ఛంద మెఱు గ కుండ వ్రాసె శార్దూ లమ్మున్

సుందర పద జా  లముతో
నిందిర పతి వ్రాసె నొక్క నెఱు గని  పద్య
మ్కం దములో నే వ్రాయగ
ఛంద మెఱు గ కుండ వ్రాసె శార్దూ లమ్మున్

Monday, 10 November 2014

పద్య రచన ప--ఐసు ఫ్రూ టులు

ఐసు ఫ్రూ టు లు గలవట హా హ
యెంత బాగుగ నున్నవో నంత చేటు
గలుగ జేయును నిజమిది కనుక నెవరు
చీక రాదవి  కవివర ! చీక వలదు

Saturday, 8 November 2014

న్యస్తా క్షరి =రావణుని పాత్ర, --నాలుగు పాదాలలో మొదటి గా రా -మా -రా -వు ఉండాలి

రావణుండు పాత్ర రాణించె గతనన
మామ  నస్సు  లందు మహితు  డాయె
రాము డైన గాని రావణు డైన భా
వుకులు నతని నెవరు బోల లేరు